ఆమె జ్ఞాపకంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం..రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
మహాత్మా జ్యోతిబా ఫూలే సతీమణి సావిత్రీబాయి ఫూలే జయంతిని రాష్ట్ర మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. బాలికల విద్య కోసం విశేషంగా కృషి చేసిన ఆమెకు జ్ఞాపకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఏటా జనవరి 3వ తేదీని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో 50 శాతానికి పైగా మహిళా ఉపాధ్యాయులే ఉన్నారని, వారిని సన్మానిస్తూ ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరక్టర్ ఆదేశాలిచ్చారు.