NationalNews Alert

ముంబై లోకల్ రైల్లో సీటు కోసం మహిళల కొట్లాట

కొందరు మహిళలు చాల గౌరవప్రదంగా, చెయ్యెత్తి దణ్ణం పెట్టేలా  ఉంటారు, మరికొందరు స్త్రీతత్వానికే మచ్చ తెచ్చే పనులు చేస్తూ ఉంటారు. ఈ సంఘటన అటువంటిదే. సాధారణంగా మంచినీటి కొళాయిల వద్ద మహిళల ఫైటింగ్ సీన్లు చూస్తూ ఉంటాం. కానీ లోకల్ ట్రైన్‌లో సీటు కోసం అంత స్థాయిలో వివాదాలు ఉండవు. ప్రయాణ సమయం కొద్దిసేపే… కాబట్టి సర్థుకుని ప్రయాణాలు చేసేస్తూ ఉంటారు. కానీ ముంబయి లోకల్ రైలులో సీటుకోసం మొదలైన గొడవ ఇద్దరు స్త్రీల మధ్య గాయాలయ్యేంత కొట్టుకొనే వరకూ వెళ్లింది. ఖాళీ అయిన ఒక సీటులో కూర్చునేందుకు ఇద్దరు మహిళలు ప్రయత్నించారు. మొదట్లో మాటలతో మొదలైన గొడవ రక్తం వచ్చేలా దాడి చేసుకునేంతగా మారింది. వారికి కొందరు మహిళలు తోడవడంతో ఆ కంపార్టమెంట్ యుద్ధభూమిలా మారింది.  వారిని అడ్డుకొనేందుకు ప్రయత్నించిన మహిళా పోలీసులపై కూడా తిరగబడ్డారు వారు.  ఈ గొడవలో శారద ఉగాలే అనే మహిళా పోలీస్ తలకు తీవ్రగాయమవడంతో వాషి రైల్వే పోలీస్ స్టేషన్ ఇనస్పెక్టర్ శంభాజీ కటారే కేసు నమోదు చేసి, అర్జూఖాన్ అనే మహిళను అరెస్టు చేసారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.