భర్తపై అలిగి వెళ్లిన మహిళ-పీఎస్‌లో భర్త ఫిర్యాదు
కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ భర్తపై ఇంటి నుంచి అలిగి వెళ్లిపోయింది.ఈ ఘటన హైద్రాబాద్ లోని బాలా నరగర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు బాలానగర్‌లో నివాసం ఉంటున్న ఓ కుటుంబంలో కలహాలు పొడసూపాయి.దీంతో భార్యభర్తలు కొంత కాలంగా ఘర్షణ పడుతున్నారు.ఈ క్రమంలో బుధవారం రాత్రి సదరు మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి భర్తకు చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది.భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.