ప్రాణాలకు తెగించి, బావిలో భర్తను కాపాడుకుంది
భారత మహిళలకు ప్రాణప్రదమైన భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రాణాలైనా ఇస్తారనే విషయం ఈ మహిళ విషయంలో నిజమయ్యింది. కేరళలోని పిరవమ్ అనే ప్రాంతంలో భర్త రమేశన్(64) మిరియాలు తీస్తుండగా ప్రమాదవశాత్తూ చెట్టు విరగడంతో పక్కనున్న 40 అడుగుల లోతైన బావిలో పడిపోయారు. వెంటనే పక్కనే ఉన్న అతడి భార్య పద్మ(56) మరో ఆలోచన లేకుండా తాడు కట్టుకుని బావిలోకి దిగిపోయింది. అప్పటికే మునిగిపోయి, స్పృహ కోల్పోతున్న భర్తను అలాగే 20 నిమిషాల పాటు పట్టుకుని, కేకలు పెట్టింది. దీనితో స్థానికులు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనితో వల సహాయంతో వారిని బయటకి తీసి, ఆసుపత్రికి తరలించారు. ఆమెను అధికారులు అభినందించారు.