Redmi 6A మొబైల్ పేలి మహిళ మృతి…స్పందించిన ఫావోమి
మన జీవితంలో ఫోన్ ఎంత ముఖ్య పాత్ర పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ఎన్నో ఫోన్స్ మార్కెట్‌లోకి వస్తున్నాయి. వాటిలో ఒకటి Redmi సెల్ ఫోన్స్. అయితే ఇంతకుముందు కూడా ఈ కంపెనీ ఫోన్స్ పేలాయి అన్న వార్తలు చాలానే వచ్చాయి. తాజాగా Redmi 6A పేలి ఓ మహిళ చనిపోవడంతో ప్రస్తుతం దీనిపై ఎన్నో విమర్మలు వెల్లువెత్తుతున్నాయి. నిద్ర పోతున్న సమయంలో తన దిండు పక్కన పెట్టిన ఫోన్ పేలడంతో మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై షావోమి ఇండియా కంపెనీ స్పందించింది. మాకు ప్రజల సేఫ్టీ చాలా ముఖ్యం అని స్పష్టం చేసింది. అలాంటి విషయాలపై ఎంతో శ్రద్ధ పెడతాం అని తెలిపింది. బాధిత కుటుంబాన్ని కలిసేందుకు తమ టీం ప్రయత్నిస్తోందని , ప్రమాదానికి గల కారణాలను తెలుసుకొని విచారణ జరుపుతామని పేర్కొంది. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబానికి తాము అండగా నిలుస్తామని చెప్పింది.

