కట్నం కోసం మహిళను ఏం చేశారంటే..
ఏపీలోని నెల్లూరు జిల్లాలో కట్నం కోసం భర్త, అత్తమామలు, ఆడపడుచు కలిసి ఒక మహిళను దారుణంగా, అఘాయిత్యంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. మృతురాలు నాగలక్ష్మిని గత కొంత కాలంగా కట్నం కోసం వేధిస్తున్నారని, ఆమె తల్లిదండ్రులకు, పోలీసులకు ఫిర్యాదు చేస్తుందనే భయంతో ఆమెపై పలుమార్లు దాడి చేసి, అమానవీయంగా వివస్త్రను చేసి కొట్టి చంపేశారని ఆమె తండ్రి ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకి పంపించి, ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

