InternationalNews Alert

లడఖ్ వద్ద చైనా-భారత్ దళాల ఉపసంహరణ

భారత్-చైనా వాస్తవాధీన రేఖ వద్ద ఇరు దేశాల దళాలు వెనక్కు కదులుతున్నాయి. 16 వ విడత కార్ప్స్ కమాండర్ లెవెల్ చర్చల్లో కుదిరిన అంగీకారం ప్రకారం ఈ ఉపసంహరణ జరుగుతోంది. లడఖ్‌లోని గోగ్రా-హాట్ స్ప్రింగ్స్ పీపీ-15 నుంచి భారత్- చైనా దళాల ఉపసంహరణ గురువారం ప్రారంభమైంది. ప్రణాళికా బద్దంగా, సమన్వయంతో ఈ ఉపసంహరణ జరుగుతోందని ఇరుదేశాల సైన్యాలు విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఏర్పడిన ప్రతిష్టంభన పరిష్కారానికి ఇది ముందడుగులా మారబోతోంది. అంతకు పూర్వం 2020లో గాల్వన్ లోయలోని పెట్రోలింగ్ పాయింట్ నుండి, 2021 ఫిబ్రవరిలో పాంగాంగ్ సరస్సు నుంచి, 2021 ఆగస్టులో గోగ్రాలోని పీపీ17ఏ నుంచి ఇరుదేశాల దళాల ఉపసంహరణ జరిగింది. ఇంకా దెమ్‌చోక్, డెప్సాంగ్‌లలో ఇంకా ప్రతిష్ఠంభన కొనసాగుతోంది.