Home Page SliderNational

మోహనా మెహతా రాథోడ్ టెలివిజన్ షోలతోనే…

 టెలివిజన్‌ రియాలిటీ షోలో  మోనాలిసా “నాజర్” షోలో మోహనా మెహతా రాథోడ్ పాత్రతో ప్రసిద్ధికెక్కింది. బాలీవుడ్ మూవీ “బ్లాక్ మెయిల్”లో యాక్టర్స్ అజయ్ దేవగణ్‌, సునీల్ శెట్టితో కలిసి నటించడానికి ముందు మోనాలిసా తన కెరీర్‌ను లో బడ్జెట్ సినిమాలలో నటించడం ద్వారా మొదలుపెట్టింది. ఆమె బాలీవుడ్ అరంగేట్రం తర్వాత, ఆమె దక్షిణ భారత సినిమాల్లోకి ప్రవేశించి, చెప్పుకోదగ్గ ప్రదర్శనలు ఇచ్చింది. అమీన్ గాజీ సరసన “తౌబా తౌబా” చిత్రంలో ఆమె నటనే ఆమెకు ఎనలేని గుర్తింపు తెచ్చింది. ఆమె “జాక్‌పాట్” అనే కన్నడ చిత్రంలో కూడా యాక్ట్ చేసింది. మిథున్ చక్రవర్తి, మనోజ్ తివారీ నటించిన “భోలే శంకర్” చిత్రంతో మోనాలిసా భోజ్‌పురి సినిమాల్లో నటించడానికి ముందుకొచ్చింది. ఈ చిత్రం పెద్ద కమర్షియల్ హిట్‌ అని చెప్పుకోవాలి, భోజ్‌పురి చలనచిత్ర చరిత్రలో అతిపెద్ద ఓపెనింగ్‌గా కొత్త రికార్డును నెలకొల్పింది. ఆమె భోజ్‌పురి చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటిగా స్థిరపడింది, “హమ్ బాహుబలి,” “సాత్ సహేలియన్,” “దేవ్రా బడా సతవేలా,” “దేవ్రా భైల్ దీవానా” వంటి విజయవంతమైన చిత్రాలలో కూడా యాక్ట్ చేసింది. ఈ చిత్రాలు భోజ్‌పురి సినిమాలో ప్రముఖ నటిగా ఆమె స్థానాన్ని పదిల పరిచాయి. టెలివిజన్‌లో, మోనాలిసా “నాజర్” షోలో మోహనా మెహతా రాథోడ్ పాత్రతో గణనీయమైన పేరు ప్రఖ్యాతుల్ని మూటగట్టుకుంది. “నమక్ ఇస్స్క్ కా”లో ఐరావతి వర్మగా, “బేకాబూ”లో యామిని రాయ్‌చంద్‌గా ఆమె తన నటనతో మరింత ప్రశంసలు పొందింది. 2022లో, ఆమె తన భర్త విక్రాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో కలిసి “స్మార్ట్ జోడి” అనే రియాలిటీ షోలో పాల్గొంది, ఆపై “ఫవ్వారా చౌక్” షోలో రామ అనే పాత్రను పోషించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో, మోనాలిసా ఇటీవల ఒక చిత్రాన్ని షేర్ చేసింది, అక్కడ ఆమె టైడ్ – అప్ షర్ట్, మ్యాచింగ్ షార్ట్‌లతో కూడిన స్టైలిష్, కలర్‌ఫుల్ దుస్తులను ధరించి సభికుల్ని కవ్వించింది.