NationalNews

రేపటి నుంచి పార్లమెంట్‌ వింటర్‌ సెషన్స్‌

రేపటి నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఈ నెల 29 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. 17 రోజుల పాటు సమావేశాల్లో కేంద్రం 17 బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఎన్నికల ప్రక్రియలో సంస్కరణలు తెచ్చే బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. నేషనల్‌ డెంటల్‌ కమీషన్‌, కంటోన్మెంట్‌, కోస్టల్‌ ఆక్వాకల్చర్‌ బిల్లులు పార్లమెంట్‌ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు సమావేశాల నిర్వహణ తేదీలపై విపక్షాలు అభ్యంతరం తెలిపాయి. క్రిస్మస్‌ పండగ సెలవుల్లోనూ సమావేశాలు నిర్వహిస్తామనడం సరికాదన్నాయి. విపక్షాల తీరుపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఫైరయ్యారు. క్రిస్మస్‌ పండగ తర్వాత కూడా పార్లమెంట్‌ సమావేశాలను వద్దనడం సరికాదని ప్రతిపక్ష పార్టీలపై ప్రహ్లాద్‌ జోషి ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని అంశాలపై చర్చకు కేంద్రం సిద్ధంగా ఉన్నామన్నారు. 40 పార్టీలను అఖిలపక్షానికి ఆహ్వానిస్తే 31 పార్టీలు హాజరయ్యాయని మంత్రి తెలిపారు.