HealthHome Page SliderNational

చలికాలంలో షుగర్ రోగులకు అలర్ట్…

షుగర్ వ్యాధి ఒక సైలంట్ కిల్లర్. డయాబెటిస్ రోగులు చలికాలంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవలసి వస్తుంది. చలికాలంలో ప్రజలు ఎక్కువగా తింటారని ఒక సర్వేలో తేలింది. ముఖ్యంగా డయాబెటిస్ వారు స్వీట్లు, వేపుళ్లు తినకుండా జాగ్రత్తగా ఉండాలి. స్వీట్లు, ఫాస్ట్ ఫుడ్స్, అరటి పళ్లు తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ఆకు కూరలు, కూరగాయలు, కేలరీస్ ఎక్కువగా లేని పళ్లు తినాలని పేర్కొంటున్నారు. అంతేకాక చలిగా ఉందని వ్యాయామం చేయడం మానేయకూడదని, వ్యాయామం లేదా నడక ఆపడం వల్ల చక్కెర స్థాయిలు పెరిగిపోతాయని హెచ్చరించారు. రోజుకు కనీసం 2 కిలోమీటర్లు నడవడం, చిన్న చిన్న వ్యాయామాలు చేయాలని సూచించారు. చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుకోవాలని, అలాగే మందులు క్రమం తప్పకుండా వాడాలని పేర్కొన్నారు.