ఆదిలాబాద్ జిల్లా అసెంబ్లీ విజేతలు వీరే…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జోరుగా వెలువడుతున్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని విజేతలు
సిర్పూర్-బీజేపీ అభ్యర్థి పాల్వాయ్ హరీష్ బాబు తన సమీప ప్రత్యర్థి బీఆర్‌ఎస్‌కు చెందిన కోనేరు కోనప్పపై 2,456 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు.
చెన్నూరు-కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేకానందరెడ్డి తన సమీప బీఆర్‌ఎస్ అభ్యర్థి బల్క సుమన్‌పై 37,515 ఓట్ల మెజారిటీలో ఉన్నారు.
బెల్లంపల్లి- కాంగ్రెస్‌కు చెందిన గడ్డం వినోద్, బీఆర్‌ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్యపై 36,878 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు.
మంచిర్యాల-కాంగ్రెస్ పార్టీ కొక్కిరాల ప్రేమసాగర్ రావు, బీఆర్‌ఎస్ అభ్యర్థి రఘునాథ్ వీరబెల్లిపై ఆధిక్యతలో ఉన్నారు.
అసిఫాబాద్ – బీఆర్‌ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మి, సమీప కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీర్ శ్యామ్‌పై 23,143 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు
ఆదిలాబాద్- బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్, బీఆర్‌ఎస్ అభ్యర్థి జోగు రామన్నపై 6,147 ఓట్ల ముందంజలో ఉన్నారు.
బోథ్- బీఆర్‌ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్, బీజేపీ అభ్యర్థి సోయం బాపు రావ్‌పై 22,800 ఓట్ల ముందంజలో ఉన్నారు.
నిర్మల్-బీజేపీ అభ్యర్థి అల్లేటి మహేశ్వర రెడ్డి, బీఆర్‌ఎస్ అభ్యర్థి ఇంద్రకరణ్ రెడ్డిపై 38000 ఓట్ల ఆధిక్యతలో గెలుపొందారు
ముథోల్- బీజేపీ అభ్యర్థి రామారావు పవార్, బీఆర్‌ఎస్ అభ్యర్థి గడ్డిగారి విఠల్ రెడ్డిపై 23000 ఓట్ల ఆధిక్యతలో గెలుపొందారు
ఖానాపూర్- కాంగ్రెస్ అభ్యర్థి వెదమ బొజ్జ, సమీప బీఆర్‌ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ భుక్యపై 4,110 ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు.