మిలటరీలో చేరతారా..?భారీగా నోటిఫికేషన్లు..
భారత మిలటరీ భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఆసక్తి ఉన్న యువతీ యువకులు దరకాస్తు చేసుకోవచ్చంటూ ప్రకటన విడుదలయ్యింది. ఇండియన్ మిలటరీ అకాడమీలో జనవరి 2026న ప్రారంభం కాబోయే 142వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (టీజీసీ)కు నోటిఫికేషన్ వెలువడింది. ఏప్రిల్ 30 నుండి మే 29 వరకూ దరకాస్తు చేసుకోవచ్చు. బీటెక్ గ్రాడ్యుయేట్లు, ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు కూడా అర్హులే. వయసు 20-27 మధ్య ఉండి, అవివాహితులై ఉండాలి. 2 టెస్టులు, ఇంటర్యూ, మెడికల్ టెస్టుల ద్వారా ఎంపిక చేస్తారు. దీనిపై పూర్తి వివరాల కోసం www.joinindianarmy.nic.in ను చూడవచ్చు.