Home Page SliderInternational

ఇకపై ఫోన్లలో గూగుల్ ఉంటుందా?

ఇకనుండి తయారయ్యే ఫోన్లలో గూగుల్ సెర్చింజన్ ఉంటుందో, ఉండదో చెప్పలేము. ఎందుకంటే గూగుల్‌కు పోటీగా తమ ఫోన్లలో మైక్రోసాఫ్ట్‌కు సంబంధించిన బింగ్‌ను ప్రవేశపెట్టారలని శాంసంగ్ సంస్థ భావిస్తోంది. భారతీయ మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్న శాంసంగ్ ఫోన్లలో గూగుల్ లేకపోతే గూగుల్ సంస్థ దాదాపు మూడు బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నష్టపోతుందట. బింగ్ చాలా అభివృద్ధి చెంది గూగుల్‌కు గట్టి పోటీ ఇస్తోంది. దీనితో ఈ సెర్చింజన్‌కు  కొత్తగా వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌జీపీటీని కూడా జత చేశారు. దీనితో తీవ్ర పోటీ నెలకొనే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటి వరకూ గూగుల్‌కు సంబంధించిన ఆండ్రాయిడ్ సిస్టంనే శాంసంగ్ ఫోన్లలో వాడుతున్నారు. మిగిలిన కంపెనీలు కూడా అదేబాట పట్టే అవకాశముంది. దీనితో గూగుల్ సంస్థ కూడా తమ సెర్చింజన్‌కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ప్రవేశపెట్టే ప్రయత్నాలు మొదలు పెట్టింది.