Telangana

ఆ ఎమ్మెల్యేలతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూలిపోతుందా?

మొయినాబాద్‌ ఫాంహౌస్‌ కుట్రకు  స్ర్కిప్టు, డైరెక్షన్‌, యాక్షన్‌ అంతా ప్రగతి భవన్‌ నుంచే జరిగిందని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జి లేదంటే సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. మునుగోడులో ఓటమి పాలవుతున్నామని తెలిసి.. టీఆర్‌ఎస్‌ కొత్త డ్రామాను తెర లేపిందని కిషన్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపు చేసి మంత్రులను చేసింది టీఆర్‌ఎస్‌ కాదా అని ప్రశ్నించారు.  అధికారం పోతే అక్రమాలపై దర్యాప్తు జరుగుతుందనే భయంతో ఇలాంటి డ్రామాలు చేస్తున్నారని కిషన్‌ రెడ్డి మండిపడ్డారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలు చేరితే బీజేపీకి వచ్చే లాభం ఏమిటని ప్రశ్నించారు. ఆ ఎమ్మెల్యేలతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూలిపోతుందా? అని విమర్శించారు.