Home Page SliderTelangana

తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల ఎఫెక్ట్ DSC పరీక్షలపై పడనుందా?

తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ అసెంబ్లీ ఎన్నికలతో తెలంగాణాలో జరగాల్సిన డీఎస్సీ పరీక్ష వాయిదా పడే అవకాశం కన్పిస్తోంది. కాగా తెలంగాణాలో నవంబర్ 20 నుంచి 30 వరకు 11 జిల్లాల్లో CBT విధానంలో పరీక్ష నిర్వహించనున్నట్లు TSPSC నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయితే ఇప్పుడు నవంబర్ 30న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. దీంతో డీఎస్సీ పరీక్ష నిర్వహణపై సందిగ్దం నెలకొంది. ఈ మేరకు డీఎస్సీ పరీక్ష నిర్వహణపై అధికారుల నుంచి స్పష్టత రావాల్సి వుంది. మరోవైపు డీఎస్సీ  పరీక్షకు సన్నద్దమవుతున్న అభ్యర్థులు పరీక్ష వాయిదా పడుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు.