Andhra PradeshHome Page SliderTelangana

టీడీపీ-జనసేన ఏపీ పొత్తుకు కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి ఎన్నికకు లింకేంటి?

ఇక శేరిలింగంపల్లిలో కూడా సీన్ తేడా కొడుతోంది. స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ కమ్మ సామాజికవర్గం వ్యక్తే కాదు.. ఆయన అఖిలభారత కమ్మ సంఘానికి అధ్యక్షులుగా పనిచేశారు. ఇప్పటికీ ఆయనను కమ్మ నాయకుడిగా వారంతా భావిస్తారు. ఇప్పుడు ఆయన తెలంగాణలో కీలక సామాజికవర్గాలైన యాదవ, గౌడ వర్గాలకు చెందిన ఇద్దరు వ్యక్తులతో తలపడుతున్నారు. మాదాపూర్‌కు చెందిన స్థానిక కార్పొరేటర్ జగదీష్ గౌడ్, మరోవైపు మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ తనయుడు రవికుమార్ యాదవ్ అక్కడ బరిలో నిలిచారు. అయితే ఇప్పుడు కమ్మ-కాపు వార్ ఎలా అనుకుంటున్నారా? కూకట్ పల్లిలో ఉన్న కమ్మ ఓటర్లు.. తమ కులానికి చెందిన బండి రమేష్‌కు కాకుండా, జనసేన మద్దతిస్తున్న ప్రేమ్ కుమార్ కు ఓటేస్తారా అన్నది చూడాలి. అదే సమయంలో శేరిలింగంపల్లిలో భారీగా ఉన్న కాపు సోదరులు అరికెపూడె గాంధీకి ఎంత వరకు ఓటేస్తారో చూడాలి. ఇప్పటికే కాపు సోదరులు బీఆర్ఎస్ పార్టీకి మద్దతిస్తున్నారన్న భావన కూడా ఉంది. ఈ తరుణంలో పవన్ కల్యాణ్ రాజకీయం రెండు వర్గాల మధ్య చిచ్చు పెడుతోందా.. లేదంటే సయోధ్య కుదుర్చుతుందా అన్న భావన కలుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు టీడీపీ-జనసేన కలిసి ముందుకు సాగాలనుకుంటున్న తరుణంలో కాపు-కమ్మ రాజకీయం మొత్తం పరిణామాలను రసకందాయంలో పడేస్తున్నాయ్.