Home Page SliderTelangana

బీసీ జాబితాలో ముస్లింలను చేర్పిస్తే ఆమోదించం..

బీసీ జాబితాలో ముస్లింలను చేర్పిస్తే ఆమోదించే ప్రసక్తే లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఈ విషయం తెలిసి కూడా కేంద్రంపై నెట్టాలనుకోవడం రేవంత్ ప్రభుత్వ మూర్ఖత్వమని విమర్శించారు. రిజర్వేషన్ల అంశంలో బీసీ కేటగిరీ నుంచి ముస్లింలను తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే హిందూ సమాజం నుంచి తిరుగుబాటు తప్పదని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఎక్స్ వేదికగా వార్నింగ్ ఇచ్చారు. ‘బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే చిత్తశుద్ధి రేవంత్ ప్రభుత్వానికి లేదని తేటతెల్లమైంది. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము కాంగ్రెస్ కు లేదు. మార్చిలోపు ఎలక్షన్స్ నిర్వహించకపోతే తెలంగాణకు నష్టమని తెలీదా? 15వ గ్రాంట్స్ కమిషన్ నిధులు ఆగిపోతాయని తెలిసి కూడా జాప్యం చేస్తారా? ఇప్పటికే రెండు దఫాలుగా నిధులు రాలేదు. 73, 74వ రాజ్యాంగ సవరణలను ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. ఓడిపోతామనే భయంతోనే రేవంత్ స్థానిక ఎన్నికలు నిర్వహిస్తలేదని బండి ట్వీట్ చేశారు.