మళ్లీ అప్పు చేయనున్న.. మంగళవారం ప్రభుత్వం
ఏపిలో కూటమి ప్రభుత్వానికి వైసీపి నేతలు…మంగళవారం ప్రభుత్వం అంటూ కొత్త పేరు పెట్టారు.ప్రతీ మంగళవారం అప్పు చేస్తామని ఆర్.బి.ఐ.కి ముఖ్యమంత్రి గా బాధ్యతలు స్వీకరించిన నాడే చెప్పారని ఎద్దేవా చేస్తున్నారు.ఇందులో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం…వచ్చే మంగళవారం అంటే డిసెంబర్ 3, 2024న రూ.4,237 కోట్ల మేర అప్పు చేయనున్నట్లు ఆర్.బి.ఐ.కి లేఖ ద్వారా తెలిపిందని చెప్పారు. సంపద సృష్టించడం అంటే ప్రజలపై ఆర్ధిక భారం మోపడం,అప్పులు చేయడమా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా కూటమి ప్రభుత్వం అడిగిన మొత్తాన్ని ఆర్బీఐ సమీకరించనున్నట్లు ప్రకటించింది. గత వారమే కూటమి ప్రభుత్వం 7.18 శాతం వడ్డీకి రూ.2000 కోట్ల అప్పు చేసింది.దీంతో కూటమి ప్రభుత్వం ఈ 5 నెలల్లో చేసిన అప్పు రూ.67,237 కోట్లకు చేరింది.అందుకే తాము దీన్ని మంగళవారం ప్రభుత్వం అంటున్నామని వైసీపి నేతలు ఎద్దేవా చేస్తున్నారు.

