Home Page SliderNews

భూమా మౌనికతో హీరో మంచు మనోజ్ పెళ్లి

భూమా మౌనిక పెళ్లికుతురు… మనోజ్ వెడ్స్ మౌనికా అంటూ ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు హీరో మనోజ్. చాన్నాళ్లుగా హీరో మనోజ్, మౌనిక మధ్య ప్రేమ సాగుతోంది. త్వరలోనే వారు పెళ్లి చేసుకుంటారని కూడా ప్రచారం జరిగింది. గత ఏడాది వినాయక చవిత సందర్భంగా… మనోజ్, మౌనికతో దర్శనమిచ్చారు. పెళ్లెప్పుడని అభిమానులు మనోజ్‌ను ప్రశ్నించారు. ఐతే, మంచు మనోజ్ ఈ వేడుకను కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలోనే చేసుకోబోతున్నారు. కాబోయే భార్య మౌనిక ఫోటోను మనోజ్ ట్విట్టర్లో షేర్ చేశాడు. మనోజ్ ట్విట్టర్‌లో ఈ చిత్రాన్ని పంచుకుంటూ, “పెళ్లికూతురు @భూమామౌనిక#MWedsM #ManojWedsMounika” అని క్యాప్షన్ ఇచ్చాడు. ఫిబ్రవరి 23 న మనోజ్, మౌనిక వివాహ వేడుకలను ప్రారంభించారు. దాని తర్వాత మనోజ్ సోదరి ఇంటి లక్ష్మి వద్ద హల్దీ, సంగీత జరిపారు.