Home Page SliderNational

‘త్వరలోనే పెళ్లి చేసుకుంటా’…మృణాల్

‘సీతారామం’తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అందాల బొమ్మ మృణాల్ ఠాకూర్. తన అందంతో, అభినయంతో అందరినీ కట్టి పడేసింది. కెరీర్ మంచి పీక్‌లో ఉండగానే, పెళ్లి చేసుకుంటా అంటూ ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. కెరీర్ బాగున్నా, చేతినిండా సినిమాలున్నా ఆమె ఇలా చెప్పడంతో ఆశ్చర్యపోతున్నారు జనాలు. కానీ, వృత్తికి, పర్సనల్ జీవితానికి ముడి పెట్టొద్దని స్వీట్‌గా చెప్పేసింది. ఏ వయసులో  జరగాల్సిన ముచ్చట అప్పుడు జరగాల్సిందే కదా. ఈ మధ్యనే నాని, మృణాల్ జంటగా  విడుదలైన ‘హాయ్ నాన్న’ చిత్రంలో మృణాల్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. విజయ్ దేవరకొండ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా  వస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’  సినిమా చిత్రీకరణలో ఉంది.