డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ కానున్నారా?
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. ఆయన ప్రముఖ సినీ నటి డేనియల్స్‌తో 2006లో అఫైర్ నడిపినట్లు ఇటీవల పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే ఈ విషయం బయటకు రాకుండా ఆయన ఆమెకు రూ.1,30,000/- డాలర్లు ఇచ్చినట్లు పుకార్లు షికార్లు చేశాయి. ఇదే ఇప్పుడు ట్రంప్ పాలిట శాపంగా మారి అరెస్ట్ దాకా తీసుకు వచ్చింది. అయితే ఈ ఆరోపణలు వాస్తవమేనని న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ తేల్చింది. కాగా తాజా పరిణామాలను ట్రంప్ ఖండించారు. తనను కావాలనే తన ప్రత్యర్థులు వెంటాడుతున్నారని ట్రంప్ ఆరోపించారు. మరోవైపు ట్రంప్ అరెస్ట్‌ను ఖండిస్తూ..ఆయన మద్దతు దారులు నిరసనలకు సిద్ధమవుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ట్రంప్ ఇటువంటి చిక్కుల్లో పడడం ఆయన రాజకీయ జీవితానికి అస్సలు మంచిది కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.