Andhra PradeshBreaking Newscrimehome page sliderHome Page SliderNewsNews AlertTrending Todayviral

భర్తను చంపి డోర్ డెలివరీ చేసిన భార్య

వైవాహిక జీవితాల్లో మనస్పర్థలు పెరిగిపోతున్నాయి. దీంతో క్షణాకావేశంలో కొందరు భార్యలు పక్కాప్లాన్‌తో భర్తలని అతి కిరాతకంగా చంపేస్తున్నారు. ఆ తర్వాత దానిని హత్యగా, ప్రమాదాలుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. చివరికి దొరికిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. నంద్యాల జిల్లాలోని నూనెపల్లె రమనయ్య (50)తో, పల్నాడు జిల్లా పిడుగురాల్లకు చెందిన రవనమ్మకి వివాహం జరిగింది. పెళ్లి అయిన తర్వాత వీరి వివాహా బంధంలో తరచుగా మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. అయితే భర్త రమనయ్య ప్రవర్తనతో విసిగిపోయిన భార్య రవనమ్మ.. తన భర్తని అంతమొందించాలని ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే భర్తతో వచ్చిన గొడవలతో పుట్టింటికి వెళ్లింది రవనమ్మ. భార్యను తీసుకురావడానికి పిడుగురాల్లకు వెళ్లాడు రమనయ్య. అయితే ఈ నేపథ్యంలో మరోసారి ఘర్షణ పడ్డారు భార్యభర్తలు. ఈ గొడవలో తమ్ముడితో కలసి భర్త రమనయ్యపై దాడి చేసి దారుణంగా చంపింది భార్య రవనమ్మ. డెడ్ బాడీని కారులో తీసుకొచ్చి నంద్యాల జిల్లాలోని నూనెపల్లెలో వాళ్ల ఇంటి దగ్గర పడేసి భార్య రవనమ్మ పరారైంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు రమనయ్య ఇంటి వద్దకు చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై నంద్యాల జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.