కంపెనీ వెబ్‌సైట్‌లో నోట్ రాసి భార్యా బాధితుడి సూసైడ్..
ఇటీవల భార్యల వేధింపుల కారణంగా ఆత్మహత్యలు చేసుకునే మగవారి కేసులు సంచలనం కలిగిస్తున్నాయి. బెంగళూరు టెకీ సుభాష్ ఆత్మహత్య తరహాలోనే ముంబయిలో నిశాంత్ త్రిపాఠి అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. చనిపోవడానికి ముందు కంపెనీ వెబ్‌సైట్‌లో సూసైడ్ నోట్ షేర్ చేసి హోటల్ రూమ్ ముందు ‘డు నాట్ డిస్టర్బ్’ అనే బోర్డు తగిలించి మరీ సూసైడ్ చేసుకున్నారు. ఈ లేఖలో తన భార్యతో పాటు ఆమె బంధువు కూడా తన చావుకు కారణమని పేర్కొన్నారు. ఇంత జరిగినా తన భార్యను ప్రేమిస్తూనే ఉంటానని లేఖలో పేర్కొన్నాడు. ‘మీ ఇద్దరి వల్లా నేను, నా తల్లి ఎంతో వేదన పడ్డాం. ఇకనైనా ఆమెను కలవొద్దు. ప్రశాంతంగా బాధపడనివ్వండి’ అని ఆ లేఖలో పేర్కొన్నాడు. అతని తల్లి ఒక మహిళా హక్కుల కార్యకర్త. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు.