మహిళలు బెల్లం ఎందుకు తినాలి?
బెల్లం పోషకాల గని. బెల్లం ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మన శరీరానికి అవసరమైన మూలకాలు బెల్లంలో లభిస్తాయి. విటమిన్ ఎ, బి, గ్లూకోజ్, ఐరన్, కాల్షియం, పొటాషియం, జింక్, మెగ్నీషియం వంటి ఎన్నో పోషకాలు ఇందులో ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో బెల్లం క్రమం తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తారు.
దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు.. రోజూ బెల్లం తినొచ్చా?
బెల్లంలో ఉండే సహజ చక్కెరలు, యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బెల్లాన్ని వేరుశెనగతో కలిపి తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తరచు బెల్లం తినటం వల్ల కిడ్నీలో రాళ్లు కరుగుతాయి. బెల్లం వల్ల జలుబు, గొంతు నొప్పి, దగ్గు తదితర సమస్యలను నివారిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. జీర్ణ క్రియను మెరుగుపరచడానికి, మలబద్ధకాన్ని నివారించడానికి ఆహారంలో బెల్లం చేర్చుకోవడం మంచిది. బెల్లం కూడా రుతు తిమ్మిరికి నివారణగా పని చేస్తుంది. అందువల్ల బహిష్టు సమయంలో బెల్లం తీసుకోవడం మహిళలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మహిళల్లో రక్తం శాతం పెరుగుతుంది. ఐరన్ అంది రక్తహీనత సమస్య దూరమవుతుంది. శ్వాసకోశ గ్రంథులు, ఊపిరితిత్తులు, పొట్ట వంటి వాటిని శుభ్రపరుస్తుంది. శరీరంలోని వివిధ రకాల ఎంజైమ్ లను ఎసిటిక్ యాసిడ్ గా మార్చి, జీర్ణ వ్యవస్థ పని తీరుని మెరుగు పరుస్తుంది.

