Andhra PradeshBreaking NewscrimeHome Page Slider

గ‌ద్ద‌ర్ కి ప‌ద్మ పుర‌స్కారం ఎందుకు ఇవ్వాలి రేవంత్‌?

మావోయిస్టు నాయ‌కుడు,రాజ్యాంగాన్ని విశ్వ‌సించ‌ని వ్య‌క్తి కి ప‌ద్మ అవార్డు ఎలా ఇస్తాం అని ఏపి బీజెపి ఉపాధ్య‌క్షుడు విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి …తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని సూటిగా ప్ర‌శ్నించారు.మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఎంతో మంది రాజ‌కీయ నాయ‌కుల‌ను మ‌ట్టుబెట్టిన గ‌ద్ద‌ర్ కి ప‌ద్మ అవార్డులు ఇవ్వాలా? లేదా రాజీవ్ గాంధీని చంపినందుకు ఇవ్వాలా అంటూ ఫైర్ అయ్యారు. గ‌ద్ద‌ర్ కుమార్తె కాంగ్రెస్‌లో ఉన్నంత మాత్రాన ఆయ‌న‌కు పుర‌స్కారాలు ఇవ్వాలా ? అని ప్ర‌శ్నించారు.ఇంకో రెండ‌డుగులు ముందుకేసి… గ‌ద్ద‌ర్ ఎల్‌.టి.టి.ఈ ప్ర‌భాక‌ర‌న్‌,స్మ‌గ్ల‌ర్ న‌యీం లాంటి వాళ్ల క‌న్నా ప్ర‌మాద‌క‌ర‌మైన వ్య‌క్తంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీంతో విష్ణువ‌ర్థ‌న్ రెడ్డి వ్యాఖ్య‌లు తెలంగాణ కాంగ్రెస్‌లో కాక‌రేపుతున్నాయి.