గుంటూరు ఘటనపై పవన్ ఎందుకు మాట్లాడడంలేదు..?
గుంటూరు ఘటనపై మంత్రి రోజా తనదైన శైలిలో స్పందించారు. బాబు పబ్లిసిటీ పిచ్చికి అమాయకులు బలవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వల్ల అమాయకుల ప్రాణాలు పోతున్నా పవన్‌కు కనింపించడం లేదా? అని ప్రశ్నించారు. గుంటూరు ఘటనపై పవన్ ఎందుకు స్పందించడం లేదని రోజా ప్రశ్నించారు. పవన్ ప్యాకేజీకి తప్ప రాజకీయాలకు పనికి రాడని ఎద్దేవా చేశారు. పవన్.. నోటికి హెరిటేజ్ ప్లాస్టర్ వేసుకున్నాడా అని ధ్వజమెత్తారు. గతంలో గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు 29 మందిని పొట్టనబెట్టుకున్నారన్నారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని 40 మందిని పొట్టనబెట్టుకున్నారని రోజా సెటైర్లు వేశారు.
ఎమ్మెల్యేగా గెలవలేని లోకేశ్ కు 151 సీట్లు గెలిచిన జగన్ తో పోటీయా…
చంద్రబాబు సీఎంగా ఉండగా మంగళగిరిలో ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ 151 సీట్లు గెలిచిన సీఎం జగన్ తో పోటీపడాలని చూడటం హాస్యాస్పదమన్నారు. లోకేష్ ను ఎమ్మెల్సీగా చేసిన మొట్టమొదటి రోజే వాళ్ల నాన్నకు ఓటుకునోటు కేసులో నోటీసులు వచ్చాయి. దీంతో లోకేష్ ఎంట్రీతో ఇంకా ఏం జరుగుతుందోనని టీడీపీ క్యాడర్ అంతా భయపడుతోంది. లోకేష్ పాదయాత్ర ప్లాన్ ఆయన డైటింగ్ లో భాగమే. ఈ పాదయాత్రతో టీడీపీకి ఓరిగేదేం లేదు అని మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. చంద్రబాబు హయాంలో చేసిన అప్పులో కేవలం 60 శాతం అప్పుతో అత్యధిక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సీఎం జగన్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచారని మంత్రి రోజా పేర్కొన్నారు. అమ్మ ఒడి, నాడు నేడు, వంటి అద్భుతమైన పథకాలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందని తెలిపారు. సీఎం జగన్ అప్పు తక్కువ సంక్షేమం ఎక్కువ. చంద్రబాబు హయాంలో అప్పు ఎక్కువ సంక్షేమం తక్కువ. కానీ ప్రతిపక్షం పనికిమాలిన సభలు, తన పబ్లిసిటీ స్టంట్లతో ప్రజలను డిస్టర్బ్ చేస్తోంది. రాష్ట్రంలో 2024 లో జరగబోయే ఎన్నికల్లో జగనన్న వన్స్ మోర్ అని ప్రజలు కోరుకుంటున్నారని అని రోజా స్పష్టం చేశారు.