ఆస్టియోపొరోసిస్ వ్యాధి స్త్రీలలోనే ఎందుకు ఎక్కువ?
పురుషుల కంటే మహిళలలోనే బోలు ఎముకల వ్యాధి( ఆస్టియోపొరోసిస్) ఎక్కువగా ఉందని ఒక సర్వేలో తేలింది. ఆస్టియోపొరోసిస్ వ్యాధి కారణంగా ఎముకలు బలహీనంగా అయిపోయి, ఎముకలు సులువుగా విరిగిపోతుంటాయి. ఈ వ్యాధి విషయంలో చికిత్స సమయానికి చేయించుకోవాలని లేదంటే చిన్నపాటి ఒత్తిడి తగిలినా ఎముకలు విరిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వీటికి కారణం మహిళలలో హార్మోన్ల పనితీరే కారణం అన్నారు. మెనోపాజ్ సమయంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ల స్థాయిలు తగ్గుతాయి. దీనివల్ల కాల్షియం తగ్గి, ఎముకలు బలహీనంగా మారుతాయి. స్త్రీల ఎముకలు పురుషుల కంటే చిన్నవి, సన్నగా ఉంటాయి. అందుకే సరైన చికిత్స చేయించుకోవాలి. కాల్షియం సప్లిమెంట్లు తీసుకోవాలి. సోయా, పాలు, పెరుగు, విటమిన్ డి ఉండే పదార్థాలు ఆహారంలో భాగంగా తీసుకోవాలి.