Home Page SliderNational

హర్మన్ ఎందుకు ఇలా ఆడింది..

చివరివరకూ క్రీజ్ లో ఉన్నా తన జట్టును ఓటమి నుంచి మాత్రం గట్టెక్కించడంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ విఫలమైంది. హాఫ్ సెంచరీ చేసి కీలక ఇన్నింగ్స్ ఆడినా ఆసీస్ చేతిలో మాత్రం పరాజయం తప్పించలేకపోయింది. మహిళల టీ20 ప్రపంచకప్ లో కీలకమైన మ్యాచ్ లో భారత్ ఓడిపోయి సెమీస్ అవకాశాలు చేజారింది. అయితే, హర్మన్ చివరి ఓవర్ ఆటతీరుపై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. చివరి ఓవర్లో 14 పరుగులు చేయాల్సిన తరుణంలో అప్పటికే క్రీజ్ లో హాఫ్ సెంచరీతో ఉన్న హర్మన్ ఎక్కువ స్ట్రైకింగ్ తీసుకోకపోవడంపై అభిమానులు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. మొదటి బంతిని సింగిల్ తీసి నాన్ స్ట్రైక్కర్ గా వచ్చిన హర్మన్.. మూడు బంతుల్లో 13 పరుగులు చేయాల్సినప్పుడు కూడా సింగిల్ తోనే సరిపెట్టుకుంది. కనీసం సిక్స్ ల కోసం ప్రయత్నిస్తే సూపర్ ఓవర్ వరకైనా మ్యాచ్ సాగే అవకాశం ఉండేదని పలువురు అభిప్రాయపడ్డారు. హర్మన్ ఎందుకు ఇలా ఆడిందో అర్ధం కావడంలేదంటూ కామెంట్లు పెట్టారు.