మైక్రోసైటిక్ అనీమియా ఎందుకు వస్తోంది?
శరీరంలో శక్తి లేనట్లు అనిపించడం, త్వరగా విపరీతంగా అలిసిపోవడం, తల తిరగడం వంటి లక్షణాల ద్వారా మైక్రోసైటిక్ అనీమియా వచ్చినట్లు తెలుసుకోవచ్చు. శరీరంలో ఐరన్ లోపం కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది. రక్తంలో హార్మోన్ల సమస్యలు లేదా రక్తం ఏర్పడడంలో సమస్యల వల్ల కూడా మైక్రోసైటిక్ అనీమియా రావచ్చు. రక్తంలో సాధారణస్థాయి కంటే తక్కువ ఎర్రరక్త కణాలు ఉంటే ఈ వ్యాధి వస్తుంది. శరీరం తగినంత హిమోగ్లోబిన్ ఉత్పత్తి చేయకుండా నిరోధించబడుతుంది. దీనివల్ల కణజాలాలకు ఆక్సిజన్ రవాణా తగ్గిపోతుంది. రక్తహీనత వల్ల శరీరంలో రక్తం ఉండాల్సినదానికంటే తగ్గిపోతుంది. దీనివల్ల చర్మం కూడా పొడిగా, జిగటగా మారుతుంది.
దీనిని నివారించడానికి ఖచ్చితమైన చికిత్స లేదు. వ్యక్తి లక్షణాలు, వయస్సును బట్టి వైద్యులు సిఫారసు చేసిన మందులను వాడాలి. ఆహారంలో రక్తం పట్టే పదార్థాలను ఎంచుకోవాలి. బీట్ రూట్, ఎండుద్రాక్ష, ఆకుకూరలు, ఆప్రికాట్లు, సిట్రస్ పండ్లు వంటి వాటిని తినాలి. బీట్ రూట్, క్యారెట్ జ్యూస్‌లు తాగడం వల్ల కూడా మేలు జరుగుతుంది. రక్తహీనత నివారించడానికి ఐరన్ లోపాన్ని భర్తీ చేయడం కూడా చాలా అవసరం.