ట్విటర్ లోగోను మస్క్ ఎందుకు మార్చారంటే..!
ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి దాంట్లో కీలక మార్పులు చేస్తూ.. వస్తున్నారు. దీంతో ట్విటర్ యాప్ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా ట్విటర్‌లో మరో కీలక మార్పు చేశారు. అదేంటంటే మొన్నటి వరకు బర్డ్‌గా ఉన్న ట్విటర్ లోగోను X లాగా మార్చారు. మస్క్ దీనిని ఎందుకు మార్చారని ఎంతోమందికి సందేహం కలిగింది. అయితే దీనిపై ఎలాన్ మస్క్ ఎట్టకేలకు స్పందించారు. కాగా ట్విటర్‌ను భవిష్యత్తులో సూపర్ యాప్‌గా మార్చాలనే ఉద్ధేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మస్క్ తెలిపారు. అయితే త్వరలో ఈ X(ఎక్స్)లోను కీలక మార్పులు జరగనున్నాయని ఆయన చెప్పారు. ఇకపై ఈ యాప్‌లో ఆర్థిక లావాదేవీలు కూడా జరిపేలా కీలక మార్పులు చేస్తున్నట్లు మస్క్ వెల్లడించారు. కాగా ఇప్పటికే వీడియోలకు సంబంధించి కొత్త ఫీచర్లను కూడా పరిచయం చేశామని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు.