Home Page SliderPoliticsTelangana

తప్పు చేయకుంటే భయమెందుకు…

డ్రగ్స్‌ కేసులో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి, సినీ నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీపై వస్తున్న విమర్శలకు ఆ పార్టీ నేత డీకే అరుణ కౌంటర్‌ ఇచ్చారు. డ్రగ్స్‌ కేసు కొత్తదేమీ కాదని, ఇప్పటికే వారిపై కేసు నడుస్తోందని, అందులో భాగంగానే నోటీసులు ఇచ్చారని వెల్లడించారు. తప్పు చేయకుంటే భయమెందుకు… ఏమీ లేకపోతేనే అనవసరంగా ఈడీ నోటీసులు ఇవ్వదు కదా? అని ప్రశ్నించారు. డ్రగ్స్‌ కేసులో నోటీసులు వస్తే, దాన్ని బీజేపీ పార్టీకి ముడివేయడం సరికాదని హితవు పలికారు. ఆ నోటీసులుకు బీజేపీకి ఏంటి సంబంధం అని డీకే అరుణ ప్రశ్నించారు.