Breaking NewsHome Page SliderNationalNews Alerttelangana,

ఆయ‌నే లేక‌పోతే ఐఐటిలు ఎక్క‌డివి?

దివంగ‌త ముఖ్య‌మంత్రి డా.వైఎస్సార్ లేక‌పోతే ఐఐటిలు ఎక్క‌డుండేవ‌ని తెలంగాణ డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క వ్యాఖ్యానించారు.దేశ ప్ర‌గ‌తిలో ఐఐటిల‌దే కీల‌క పాత్ర అని చెప్పారు.డా.వైఎస్సార్ విజ‌న్ ఉన్న నాయ‌కుడ‌ని కితాబిచ్చారు.అనాడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఐఐటిలు,ట్రిపుల్ ఐటిల‌కు ప్రాధాన్య‌త ఇచ్చి తెలుగు రాష్ట్రాల‌కు వాటిని తీసుకురావ‌డంలో విశేషంగా శ్ర‌ద్ద వ‌హించ‌బ‌ట్టి నేడు సాఫ్ట్ ఇండ‌స్ట్రీల‌కు హైద్రాబాద్‌ గొప్ప కారిడార్‌గా మారింద‌న్నారు. వైఎస్సార్ హయాంలోనే సంగారెడ్డికి ఐఐటీ వచ్చిందని భ‌ట్టి గుర్తు చేశారు. నూత‌న ఐటి ఆవిష్కరణలకు హైదరాబాద్‌ కేంద్ర బిందువు మార‌డం శుభ‌ప‌రిణామ‌మ‌న్నారు.తెలంగాణలో 2030 నాటికి.. ఫ్లోటింగ్ సోలార్‌పై పెట్టుబడులు పెట్టేలా చ‌ర్య‌లు తీసుకోబోతున్నామ‌ని చెప్పారు.

Breaking news: శ‌బ‌రిమ‌ల‌లో తెలుగు భ‌క్తుల బ‌స్సు బోల్తా