‘ఖుషి’ సినిమా రిలీజ్ ఎప్పుడంటే..?
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ డైరెక్షన్‌లో లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఖుషి సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. వివిధ కారణాలతో షూటింగ్ వాయిదా పడుతూ రెండు షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను ట్విట్టర్‌లో విడుదల చేశారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో విజయ్ దేవరకొండకు నార్త్ ఇండియన్ ఆడియన్స్‌లో గుర్తింపు లభించింది. లైగర్ పాన్ ఇండియా రిలీజ్ అయ్యింది. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ ద్వారా ఉత్తరాది ప్రేక్షకులకు సమంత పరిచయం అయ్యారు. అందులో నటనకు మంచి మార్కులు సాధించారు. వీళ్ళిద్దరూ నటిస్తున్న సినిమా కావడంతో దేశ వ్యాప్తంగా ఈ సినిమాకు మెగా క్రేజ్ ఏర్పడింది.

