Andhra PradeshHome Page SliderNews

అధికారంలోకి రాగానే నిత్యావసర ధరలు తగిస్తాం- నారా లోకేశ్

ఏపీలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతూ ఉంది. ఆదివారం శాంతిపురం బాలాజీ కళ్యాణమండపంలో నారా లోకేష్ మహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారని, అమ్మఒడి కేవలం పది శాతం మందికే ఇచ్చారని, మిగిలిన 90 శాతం మందికి అమ్మఒడి పథకం అందకుండా చేశారని, అమ్మఒడి డబ్బులు చక్రవడ్డీతో సహా తిరిగి తీసుకున్నారని అన్నారు. చంద్రబాబు హయాంలో మహిళలు సాధికారత సాధించారని, మహిళలకు గౌరవం కల్పించిన ఘనత టీడీపీదేనని జగన్ పాలనలో ఏపీకి వచ్చిన పరిశ్రమలు శూన్యమని, జగన్ వచ్చిన తర్వాత వందల పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయనీ పేర్కొన్నారు. ఏపీలో దిశా చట్టం లేదనీ, జగన్ ప్రభుత్వంలో వందల మంది మహిళలపై దాడులు జరిగాయనీ, యువతులను కిరాతకంగా చంపుతుంటే దిశా చట్టం ఎక్కడుందనీ ప్రశ్నించారు. మహిళల్లో చైతన్యం పెరగాలని, ధరలు ఆకాశానికి అంటించిన జగన్‍ను మహిళలే దించాలనీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసరాల ధరలు తగ్గిస్తామనీ అన్నారు.