Breaking NewsNationalNews Alert

సల్మాన్‌ఖాన్‌కు వాట్సాప్ బెదిరింపులు..కోట్ల రూపాయల డిమాండ్

బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌కు ప్రమాదం ముంచుకొస్తోంది. ఎంతగా సెక్యూరిటీ పెట్టినా ఈసారి వాట్సాప్‌లో బెదిరింపులు మొదలయ్యాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ముప్పు పూర్తిగా తొలగిపోవాలంటే ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ ముంబయి ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్ నెంబరుకు మెసేజ్ వచ్చింది. ఆ డబ్బు చెల్లించకపోతే మాజీ ఎమ్మెల్యే సిద్ధిఖీ కంటే దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాలని హెచ్చరికలు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.