ప్రాణం తీసిన వాట్సాప్ చాటింగ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. మంచుపల్లి మండలంలోని చుంచుపల్లి తండాకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్ధి మనోజ్ గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఇదే పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న పల్లవితో చనువు ఏర్పడింది.దీంతో రోజూ వాట్సాప్‌లో చాటింగ్ చేసేవాడు.విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు….మనోజ్ కి ఫోన్ చేసి వారించారు.దీంతో తన తల్లిదండ్రులకు విషయం ఎక్కడ తెలిసిపోతుందోనన్న భయంతో ఇంట్లో ఉన్న గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఖమ్మం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బాలుడు మృతిచెందాడు.దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.విద్యార్ధి మనోజ్ మృతదేహాచూసేందుకు గ్రామస్థులు పెద్ద ఎత్తున హాజరవడం ఆసక్తికరంగా మారింది.


 
							 
							