పొరపాటును మందలిస్తే తప్పేంటి?..
ముఖ్యమంత్రికి తండ్రిలాగ మందలించే హక్కు ఉందని, తాను పొరపాట్లు చేస్తే మందలిస్తే తప్పేంటి? అని ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ మీడియాతో పేర్కొన్నారు. పట్టభద్రుల ఓట్ల నమోదు విషయంలో సుభాష్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వెలిబుచ్చిన సంగతి తెలిసిందే. మొట్టమొదటిసారి గెలిచిన తనని పార్టీ ఎంతో గౌరవించిందని పేర్కొన్నారు. టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడిన విషయాలు సోషల్ మీడియాలో వైసీపీ ప్రచారం చేయడంపై విచారం వ్యక్తం చేశారు. పట్టభద్రుల ఓట్ల నమోదు విషయంలో 29 శాతం మాత్రమే నమోదయ్యాయని, రాజకీయాలపై సీరియస్‌నెస్ లేదంటూ చంద్రబాబు, సుభాష్‌తో మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.

