మా ఇంటికొస్తూ ఏం తెస్తారు….మీ ఇంటికొస్తే ఏమిస్తారు?
తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి…. ఏపి సీఎం నారా చంద్రబాబు నాయడుకి AI లా మారాడనిపిస్తుంది. అచ్చు గుద్దినట్లు ఆయన తెలివితేటలే ,ఆయన మేథస్సే వచ్చినట్లుంది. రూలింగ్‌లో, టాకింగ్ లో నూ చంద్రబాబు ఆలోచనా విధానాన్ని తెలంగాణలో తూ.చ.తప్పకుండా అమలు పరుస్తున్నట్లు అర్ధమౌతుంది.సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో సినీ ఇండస్ట్రీకి,సర్కార్‌కి మధ్య రాజీ ప్రయత్నాలు జరగుతున్నాయా అనే భావన కలిగించేలా గురువారం రెండు పక్షాల భేటీ కాగా ఇందులో సర్కార్ తీరు మాత్రం…మా ఇంటికొస్తూ ఏం తెస్తారు….మీ ఇంటికొస్తే ఏమిస్తారు? అనేలా ఉంది.బెనిఫిట్ షోలు,ప్రీమియర్ షోలు,వాటి ధరల పెంపు ఏమీ ఉండదని, కానీ డ్రగ్స్ నియంత్రణ,నిర్మూలన,తెలంగాణా సామాజిక సాధికార సర్వే ప్రచారాన్ని మాత్రం నటీనటులతో కచ్చితంగా నిర్వహించాలని ప్రతిపాదనలు పెట్టింది రేవంత్ సర్కార్.దీంతో సినీ పెద్దలంతా ఖంగుతిన్నారు.ఇదేంట్రా బాబు… ఇలా ఇరుక్కుపోయాం అనుకుంటూ తలలు బాదుకుంటున్నారు. అసలు సంక్రాంతి సమీపిస్తున్న తరుణంలో టికెట్ల ధరలు పెంపుకు నిరాకరించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జరిగిన తప్పిదాన్ని భూతద్దంలో చూపిస్తూ ఒకరి మీద కక్షతో అందరినీ బలిపెట్టడం ఏంటంటూ గుసగులాడుకుంటున్నారు.