ఈ సారి బౌలర్లు ఏం చేస్తారో
ఆసియా కప్ 2022 మ్యాచ్ దగ్గర పడుతున్న కొద్ది అటు అభిమానుల్లోను , ఇటు క్రికెట్‌ర్ల లోను తీవ్ర ఉత్కంఠ నెలకొంటుంది.ఆసియా కప్‌కే ప్రత్యేకత తెచ్చే విధంగా ఆదివారం భారత్ , పాక్ తలపడనున్నాయి. ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్‌ను ఎవరు ఓ ఆటల పరిగణించక..ఎదో యుద్ధం జరుగుతుందేమో అనే విధంగా ఎదురుచూస్తుంటారు. అయితే మరి ఇంతటి ఉట్కంఠ బరితమైన మ్యాచ్‌కి భారత్ సిద్ధంగా ఉందా ?అనేదే ఇప్పుడు ప్రశ్న.

గతేడాదితో పోలిస్తే ఈ ఎడాది భారత్ జట్టులోని కొందరు కీలక ఆటగాళ్లు గాయలతో మ్యాచ్‌కి దూరమయ్యారు. ప్రధాన ఫాస్ట్‌బౌలర్ బుమ్రా వెన్నుకు గాయం కావడంతో మ్యాచ్‌కు దూరం కాగా , బౌలింగ్‌లో స్పెషలిస్ట్‌గా ఉన్న హర్షల్ పటేల్ కూడా గాయంతో మ్యాచ్‌కి దూరమయ్యాడు.

కీ ప్లేయర్స్ లేని భారత్ ఈ సారి మ్యాచ్ ఏ విధంగా ఆడుతుందో చాడాలి. ప్రస్తుతం ఆసియా కప్ 2022లో భారత్ కీ ప్లేయర్లుగా భువనేశ్వర్ కుమార్ , అర్షదీప్ సింగ్ , అవేశ్ ఖాన్ లు ఉన్నారు. ఇప్పుడు వీరిపై ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంది. అందులోను ఇద్దరు కొత్త ప్లేయర్లను సీనియర్ సెలక్టర్స్ సెలక్ట్ చేసిన విషయం తెలిసిందే.

గత సంవత్సరం జరిగిన టీ20లో 10 వికెట్ల తేడాతో భారత్‌పై పాక్ విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో మన బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయకపోవడమే భారత్ వైఫల్యానికి ప్రధాన కారణం. ఈ ఏడాది జరిగే మ్యాచ్ ఏ విధంగా జరుగుతుందో వేచి చూడాలి