పిల్లల్లో క్యాల్షియం పెరగాలంటే ఏం చేయాలి?
పిల్లల్లో పోషకాహార లోపం ఉంటే, వాళ్ళ ఎదుగుదల తగినంత ఉండదు. రక్తవృద్ధి ఉండాలి. అంటే తగినంత ప్రొటీన్, ఐరన్, బీ 12 మొదలైన పోషకాలు ఉన్న ఆహారం తప్పనిసరి. ఐరన్ కోసం మాంసాహారం, సెనగలు, గుగ్గిళ్ళు, సోయాచిక్కుడు గింజలు, ఆకుకూరలు మొదలైనవి. తరచూ పిల్లలకు ఇవ్వాలి. ఆహారంలోని ఐరన్ శరీరంలోకి శోషించుకొనేందుకు విటమిన్ సి తప్పని సరి.
ఆహారంలో తాజా పండ్లు, నిమ్మరసం లాంటివి చేర్చడం ద్వారా తగినంత విటమిన్ సి అందుతుంది. క్యాల్షియం అనేది ఎముకలకు అత్యవసరం. పాలు, పెరుగు, పనీర్, సోయా పనీర్, మీల్ మేకర్, సెనగలు, ఉలవలు లాంటి వాటన్నింటి నుంచి క్యాల్షియం అందుతుంది. క్యాల్షియం ఎముకల్లో చేరి ఎముకలు దృఢంగా ఉండాలంటే విటమిన్ డీ చాలా అవసరం. పిల్లలు రోజుకు కనీసం రెండు మూడు గంటలైనా ఎండలో ఆటలాడితే వారికి కావలసిన విటమిన్ డి లభిస్తుంది.


 
							 
							