తీర్పు రిజర్వ్ అయ్యాక పోలీసు విచారణేంది?
ఫార్మలా ఈ రేసు కేసులో కోర్టు అన్నీ వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిందని,ఇలా రిజర్వ్ చేసిన తర్వాత తీర్పు వెలువడకుండా పోలీసులు విచారణకు హాజరవ్వాలని నోటీసులివ్వడమేంటంటూ మాజీ మంత్రి కేటిఆర్ మండిపడ్డారు. సోమవారం ఆయన తన నివాసం నుంచి ఏసిబి కార్యాలయానికి విచారణ కొరకు బయలుదేరారు.ఈ సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.తను అరెస్ట్ చేయొద్దని కోర్టు ఉత్తర్వులిచ్చినప్పటికీ ..విచారణకు హాజరవ్వాలని సీఎం రేవంత్ ఏసిబి అధికారులను ఒత్తిడి చేస్తున్నారని ఆగ్రహించారు.రైతు భరోసా నుంచి డైవర్ట్ చేసి అన్నదాతల నోట్లో మన్నుగొట్టేందుకే ఈ డ్రామలంటూ రేవంత్ ని తూర్పారబట్టారు. తనకు పోలీసులపై నమ్మకం లేదని, తాను ఇలా ఇంటి నుంచి బయలుదేరగానే తన ఇంట్లో ఏదో ఒకటి పెట్టి తనని అరెస్ట్ చేయాలని చూస్తున్నారని సందేహం వ్యక్తం చేశారు.ఆ కారణంగానే తాను విచారణకు న్యాయవాదులతో హాజరౌతున్నానని కేటిఆర్ తెలిపారు.