‘దసరా కానుక ఏది?’..నిలదీసిన ఉద్యోగులు
ఏపీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎన్నాళ్లుగానో పెండిగులో ఉన్న డీఏలు, పీఆర్సీ, ఐఆర్ ప్రకటించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దసరా కానుకగా ఈ ప్రకటన చేయాలని వారు కోరుతున్నారు. గతంలో ప్రభుత్వం దసరా కానుకగా ఐఆర్‌ను ఆనవాయితీగా ప్రకటించేదని, ఇప్పుడు కూడా ఇవ్వాలని కోరుతున్నారు. నూతన వేతన సవరణ కోసం కమిటీకి ఛైర్మన్‌ను నియమించాలని ప్రభుత్వాన్ని కోరింది. గతంలో ఉన్న కమిటీ ఛైర్మన్ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినందువల్ల కొత్త ఛైర్మన్‌ను నియమించి వెంటనే పెండింగు బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు.