HealthHome Page SliderInternational

ఉప్పు పూర్తిగా మానేస్తే ఏం జరుగుతుంది?

ఉప్పు ఎక్కువ తీసుకుంటే ఎలాంటి దుష్పరిణామాలు వస్తాయో మనకు తెలుసు. కానీ ఉప్పు పూర్తిగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?. ‘అతి సర్వత్రా వర్జయేత్’ అన్నట్లు, పూర్తిగా ఉప్పు తినకుండా డైట్ చేయడం కూడా ప్రమాదమే. బీపీ భయంతో ఉప్పు పూర్తిగా వదిలేస్తే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. నిజానికి తగినంత ఉప్పు లేకపోతే అసలు ఆహారం తినలేము. అందుకే వైద్య నిపుణులు పరిమిత పరిమాణంలో ఉప్పు తీసుకోమని చెప్తూంటారు. ఉప్పు లేని ఆహారం తీసుకుంటే మనకు ఎంతో నీరసంగా ఉన్నట్లుటుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ తప్పిపోతుంది. సోడియం స్థాయి గణనీయంగా తగ్గిపోతుంది. లోబీపీ ఏర్పడి, నీటిశాతం తగ్గుతుంది. వికారం, వాంతులు, కండరాల తిమ్మిరి ఏర్పడతాయి. ప్రపంచ ఆర్థిక సంస్థ సలహా ప్రకారం ఆహారంలో ఉప్పు రోజుకి 5 గ్రాములు ఉండవచ్చు. అంతకు మించితే గుండె జబ్బులు, ఊబకాయం, గ్యాస్, కిడ్నీ సమస్యలు తలెత్తవచ్చు.