Home Page SliderTelangana

కవిత ఈడీ విచారణపై కేసీఆర్ ఏమన్నారంటే…!

ఎంత మంచి పని చేసినా బద్నా చేసేవాళ్లుంటారన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. అరెస్టు చేస్తారట చేయనీయండి చుద్దామన్నారు. ఏం చేస్తారో చూద్దాం. భయపడే ప్రసక్తే లేదన్నారు. కవిత ఈడీ విచారణపై కేసీఆర్ స్పందించారు. కుమార్తె కవితపై వచ్చిన విమర్శలపై స్పందించారు. గంగుల కమలాకర్, ఎంపీ రవిచంద్రపై మొన్నటి వరకు దాడులు చేశారని… ఇప్పుడు తన బిడ్డపైకి వచ్చారన్నారు. అందరూ జాగ్రత్తగా పనిచేయాలని కేసీఆర్ సూచించారు. వచ్చే రోజుల్లో బీఆర్ఎస్ నేతలపై మరిన్ని దాడులు జరిగే అవకాశముందని తాజాగా కేసీఆర్ హెచ్చరించారు. దేశంలో ఏ పార్టీపై పెట్టనంత ఫోకస్ బీఆర్ఎస్ పార్టీపై పెట్టారన్నారు. చర్యకు, ప్రతి చర్య తప్పక ఉంటుందన్నారు. సంక్షేమ పథకాల పార్టీకి శ్రీరామరక్షగా ఉంటాయన్నారు. ముందస్తు ఎన్నికలు లేవని.. ఆగస్టు వరకు గట్టిగా పనిచేయాలన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలపై కేసులు పెట్టే అవకాశం ఉందన్నారు. వ్యాపారాలు చేసే నేతలు లెక్కలన్నీ జాగ్రత్తగా చూసుకోవాలని గతంలో చెప్పిన కేసీఆర్… తాజాగా మరోసారి బీ కేర్ ఫుల్ అని తేల్చి చెప్పారు. కవిత విచారణ సందర్భంగా నిన్న కేటీఆర్ ఘాటుగా స్పందిస్తే.. ఇవాళ పార్టీ అంతర్గత సమావేశంలో కేసీఆర్ నర్మగర్భంగా మాట్లాడారు.