తల్లికి భయపడి ఓ యువతి ప్రియుడిని ఏం చేసిందంటే..
తల్లికి భయపడి ఓ యువతి ప్రియుడిని ట్రంకు పెట్టేలో పెట్టి తాళం వేసిన ఘటన బిహార్ లో చోటు చేసుకుంది. ఇంట్లో బట్టలు, సామాన్లు చిందరవందరగా పడి ఉండటాన్ని గమనించిన కుటుంబసభ్యులు లోపల ఉన్న యువతిని నిలదీశారు. ఆమె ఏమీ లేదంటూ కంగారు పడుతూ సమాధానం ఇవ్వడంతో అనుమానం వచ్చిన తల్లి, సోదరుడు అక్కడున్న పెట్టెను తెరవాలన్నారు. తాళం తెరవగా అందులోనుంచి ఓ యువకుడు ప్రత్యక్షమయ్యాడు. దీంతో వారంతా షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. కాసేపు పెట్టేలోనే ఉంచితే ఆ యువకుడు ఊపిరి ఆడక చనిపోయి ఉండేవాడని, దయచేసి ఇలాంటి పనులు చేయకండి అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

