హైడ్రాతో కూల్చేది కూల్చేదే
హైడ్రా అంటే కూల్చివేతలేననే అపోహల్ని ప్రజల్లోకి కొంత మంది బలంగా తీసుకెళ్తున్నారని ఇది సమంజసం కాదని హైడ్రా కమీషనర్ రంగనాథ్ అన్నారు.శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..నోటీసులు ఇవ్వకుండానే అక్రమ కట్టడాలను కూల్చివేస్తామన్నారు.హైడ్రా పరిధిలో దాదాపు 1100కి పైగా చెరువులున్నాయని వాటన్నింటిని ఆక్రమించుకుని అక్రమంగా సంపాదిస్తున్నారన్నారు.వాటర్ బాడీలో నిర్మించే అక్రమ నిర్మాణాలను కూల్చివేయడానికి ఎలాంటి అనుమతులు,నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఆక్రమణలో ఉన్న చెరువులను పూర్తిగా పునరుద్దరిస్తామన్నారు.మూసి రివర్ ప్రాజెక్టుకి,హైడ్రాకి సంబంధం లేదన్నారు.ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయని అన్నింటిని పరిశీలించాకే కూల్చివేస్తున్నామన్నారు. మూసి పరిధిలో కి హైడ్రా వెళ్తే అక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలు కూడా నోటీసులు ఇవ్వకుండానే తొలగిస్తామన్నారు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయనున్నామని ఆయన ప్రకటించారు.

