ఇవేం పనులు బాలయ్యా..
సినీ నటుడు బాలకృష్ణ ఇటీవల దేశపు అత్యున్నత పురస్కారం పద్మభూషణ్‌ను పొందిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే పద్మభూషణ్ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. అయితే ఆ అవార్డుకు తలవంపులు తెచ్చే పనులు చేస్తున్నారని విమర్శలు మొదలయ్యాయి. దీనికి కారణం బాలకృష్ణ ఒక మద్యం కంపెనీకి సంబంధించిన ప్రకటనలో నటించడమే. దీనితో ఇవేం పనులు బాలయ్యా అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. తాను యాంకరింగ్ చేసే అన్‌స్టాపబుల్ వేదికపై కూడా పలుమార్లు తన ఫేవరెట్ లిక్కర్ ఏదనేది ఆయన పలుమార్లు పేర్కొన్నారు. ‘దిల్ ఓపెన్ చేయ్.. లైఫ్ వెల్కమ్ చేయ్’ అంటూ సిగ్గు లేకుండా యాడ్‌లో నటించారు. హిందూపూర్ ఎమ్మెల్యేగా, పద్మభూషణ్ అవార్డు గ్రహీతగా ఇలాంటి పనులు చేయడంతో సోషల్ మీడియాలో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. గౌరవంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలంటూ అభిమానులు కూడా కోరుతున్నారు. అవార్డుకైనా విలువ ఇవ్వాలంటూ సూచిస్తున్నారు.