Breaking NewscrimeHome Page SliderTelangana

ల‌గ‌చ‌ర్ల రైతుల‌కు ఘ‌న‌స్వాగ‌తం

స్వాతంత్య్రానికి పూర్వం రైతుల కోసం ప్రాణాలిచ్చిన వాళ్ల‌ను చూశాం.అన్న‌దాత కోసం ప్రాణ త్యాగం చేసిన వారిని కూడా ఆనాటి కాలంలోనే చూశాం.మ‌ళ్లీ అలాంటి ఘ‌ట‌న ఇవాళ తెలంగాణాలో చూస్తున్నాం. ల‌గ‌చ‌ర్ల లో ఫార్మా సిటీ ని వ్య‌తిరేకిస్తూ జైలుకెళ్లిన రైత‌న్న‌లు రిమాండ్ నుంచి బెయిల్ పై విడుద‌లైన సంద‌ర్భంగా ఆయా గ్రామానికి చెందిన వంద‌లాది మంది ప్ర‌జ‌లు అపూర్వ‌స్వాగ‌తం ప‌లికారు.పూల‌దండ‌లు,నూత‌న వ‌స్త్రాల‌తో స్వాగ‌తం ప‌లికారు.జేజేలు ప‌లుకుతూ ఊరేగింపుగా గ్రామంలోకి ఆహ్వానించారు.వీరంతా సంప‌ద‌,ప‌లుకుబ‌డి,రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న‌వారు ఏ మాత్రం కాదు.నిఖార్సైన రైతులు. అందుకే నెల రోజుల జైలు శిక్ష త‌ర్వాత త‌మ వారి కోసం జైలుకెళ్లిన వారికి క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో వారి స్థాయికి త‌గిన‌ట్లుగా స్వాగ‌త ఏర్పాట్లు చేసి త‌మ‌కున్న కృత‌జ్క్ష‌త‌ను చాటుకున్నారు.ఒక‌డు జైలుకెళ్తే పోనీ వాడికి త‌గిన శాస్తి జ‌రిగింద‌ని సంబ‌ర‌ప‌డే ప్ర‌జ‌లున్న నేటి రోజుల్లో ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డం అన్న‌దాత‌ల ఐక‌మ‌త్యానికి నిద‌ర్శ‌నంగా చెప్పొచ్చు.