Andhra PradeshHome Page SliderNews Alertviral

ఇద్దరమ్మాయిలతో పెళ్లి..వరుడికి షాక్..

ఇద్దరమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయాడో పెళ్లి కొడుకు. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా.. వారిద్దరూ అక్కచెల్లెలు కావడం విశేషం. ఇది కూడా వింత కాదనుకుంటే వారిద్దరూ మైనర్లు. దీనితో వరుడికి గట్టి షాక్ తగిలింది. ఈ రోజుల్లో అబ్బాయిలకి ఒక పెళ్లి కావడమే కష్టంగా ఉంది. ఇక ఇద్దరమ్మాయిలతో పెళ్లనేసరికి ఎగిరి గంతేశాడు శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం గుమ్మయ్య గారి పల్లికి చెందిన గంగరాజు అనే యువకుడు. గంగరాజుకు కర్ణాటక రాష్ట్రం చిక్బల్లాపూర్ కు చెందిన ఇద్దరు యువతులతో నిశ్చితార్థం జరిగింది. ఈనెల 10వ తేదీన గోరంట్లలో పెళ్లి. ఒక వరుడికి ఇద్దరు వధువుల పేర్లతో పెళ్లి కార్డులు కూడా ప్రింట్ అయ్యాయి. ఇద్దరమ్మాయిలతో పెళ్లి అనే పెళ్లి పత్రిక తెగ వైరల్ అయింది. సోషల్ మీడియాలో ఈ వెరైటీ పెండ్లీ పత్రిక వైరల్ అవ్వడంతో ఐసిడిఎస్ అధికారులు దీనిపై దృష్టి పెట్టారు. ఇద్దరు అమ్మాయిల వయసు కనుక్కోవడంతో.. ఇద్దరూ మైనర్లు అని తెలిసింది. దీనితో అధికారులు ఎంటర్ అయి  వధువు, వరుడి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పెళ్లి క్యాన్సిల్ అయింది.