Horoscope TodayNews

ఈ రాశుల వారి విజయాలకు బలహీనతలే శాపాలు

సెప్టెంబర్ 21

మేషం : మీ అభివృద్ధికి దోహదపడే ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంటారు. తరచూ నిర్ణయాలు మారుస్తూ.. ఇబ్బందులు పడతారు. స్థిరమైన బుద్ధితో ముందుకు సాగండి. కుటుంబంలో సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి. దుర్గా అష్టోత్తరం చదవడం మంచిది.

వృషభం : చేపట్టిన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొన్ని విషయాలు ఒత్తిడిని పెంచుతాయి. ప్రశాంతంగా ఆలోచిస్తే మేలు జరుగుతుంది. దైవారాధన మనశ్శాంతినిస్తుంది. దుర్గారాధన శుభప్రదం.

మిధునం : మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసమును పెంచుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. యశస్సు వృద్ధి చెందుతుంది. గోసేవ చేస్తే బాగుంటుంది.

కర్కాటకం : అభివృద్ధికి సంబంధించిన ఒక శుభవార్త వింటారు. మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. కొన్ని సంఘటనలు మనసుకు బాధ కలిగిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఇంకా బాగుంటుంది.

సింహం : అనుకూలమైన ఫలితాలున్నాయి. స్థిరమైన నిర్ణయాలు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ప్రయాణ సౌఖ్యం ఉంది. లక్ష్మీ అష్టోత్తరాన్ని చదవడం ఉత్తమం.

కన్య : చేపట్టే పనుల్లో శారీరక శ్రమ పెరుగకుండా చూసుకోవాలి. మొహమాటం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వేంకటేశ్వర స్వామిని సందర్శించడం మంచిది.

తుల : సమాజంలో గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అభివృద్ధికి సంబంధించిన వ్యవహారంలో మీకు అనుకూలమైన నిర్ణయాలు వస్తాయి. లలితా సహస్రనామ పారాయణ చేయాలి.

వృశ్చికం : బుద్ధిబలం బాగుంటుంది. సందర్భోచితంగా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. విద్య, వినోద సుఖం ఉంది. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే మంచిది.

ధనుస్సు : మనోబలాన్ని కోల్పోరాదు. మంచిపనులు తలపెడతారు. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. శారీరక శ్రమ పెరుగుతుంది. శని ధ్యానం శుభప్రదం.

మకరం : కీలకమైన పనులను ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆహార నియమాలను పాటించాలి. వేంకటేశ్వర స్వామిని సందర్శించడం మంచిది.

కుంభం : మీ మీ రంగాల్లో విజయావకాశాలు మెరుగవుతాయి. అభివృద్ధి కొరకు చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలుంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్ట దైవారాధన శుభప్రదం.

మీనం : మంచి కాలం. చేసే పనిలో విజయావకాశాలు పెరుగుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక సంఘటన మానసిక శక్తిని పెంచుతుంది. స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణాల్లో సౌఖ్యం ఉంది. ఇష్టదైవ స్తుతి శక్తినిస్తుంది.